వరుసగా 11వ రోజు…80 దాటిన పెట్రోల్ ధర

208
petrol price
- Advertisement -

వరుసగా 11వ రోజు దేశంలో పెట్రోల్ ధరలు పెరిగాయి. బుధవారం పెట్రోల్‌ లీటర్‌ ధర 55 పైసలు, డీజిల్‌ 69 పైసలు పెరగగా పెట్రోల్ రూ.80.22కు, డీజిల్ ధర 74.54కి చేరింది.11రోజుల్లో పెట్రోల్‌ లీటర్‌కు రూ.6.02 పైసలు, డీజిల్‌ పై రూ 6.49 ధర పెరిగింది. వరుసగా పెరుగుదలతో వాహనదారులు ఇబ్బందులు ఎద్కొంటున్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర 55 పైసలు పెరుగుదలతో రూ.77.28కు చేరింది. డీజిల్ ధర కూడా 60 పైసలు పెరుగుదలతో రూ.75.79కు ఎగసింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 1.66 శాతం తగ్గుదలతో 40.27 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 2.24 శాతం క్షీణతతో 37.51 డాలర్లకు తగ్గింది.

- Advertisement -