పెట్రో భారం బరించలేక.. అరవింద్‌పై ట్రోలింగ్!

112
arvaind
- Advertisement -

సోషల్ మీడియాలో బీజేపీ నేతలు ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. 2014లో మోడీ అధికారంలోకి రావడానికి ప్రధానంగా దోహదం చేసిన వాటిలో సోషల్ మీడియా ఒకటి. అయితే ఇదంతా వారికి ఒకప్పుడు లాభించిన ఇప్పుడు మాత్రం ప్రతికూల పరిస్థుతలే ఎదురవుతున్నాయి. బీజేపీ నేతలు ప్రధానంగా మోడీ అధికారంలోకి రావడానికి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పెట్రోల్ ధరలు తగ్గిస్తామని చెప్పిన పెద్దసార్ మోడీ…ఇప్పుడు అవే పెట్రోల్ ధరలు సెంచరీ దాటించడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇప్పుడు ఇదే సెగ మన నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు తాకింది. ఫోటో పాతదే అయినా అరవింద్ సార్..చిన్నపిల్లల ఎలక్ట్రిక్ వెహికిల్ నడుపుతూ కనిపిస్తున్న ఫోటో వైరల్‌గా మారగా నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం రోజు రోజుకు పెట్రోల్ దరలు పెంచుతున్న కారణంగా చార్జింగ్ వెహికిల్ కొని డ్రైవింగ్ చేస్తున్న ఆ పార్టీ ఎంపీ సార్ అంటూ చురకలు అంటిస్తున్నారు.

ఇదంతా బీజేపీ నేతలు చేసుకున్న పాపమే. ఎందుకంటే బీజేపీ నేతలు,వారి అంధ భక్తులు ఎంతవరకు దిగజారుతారంటే చివరికి ఓ వ్యక్తి మాట్లాడని మాటలు సైతం మార్ఫింగ్ చేసి ప్రచారం చేయడంలో అస్సలు నిస్సిగ్గుకూడా పడరు. ఇటీవలె హరీష్ రావు…టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు వివరిస్తూ టీఆర్ఎస్‌కు ఓటేయాలని చెప్పగా దానిని మార్ఫింగ్ చేసి టీఆర్ఎస్ ఉన్న చోట బీజేపీ అని చెప్పి వికృత చేష్టలకు దిగారు. చివరకు టీఆర్ఎస్ సోషల్ మీడియా సెల్ దానికి కౌంటర్‌గా ఒరిజినల్ వీడియో ప్రచారంలోకి తెగ చల్లబడ్డారు కాషాయ భక్తులు. చివరకు బతుకమ్మ పండుగను కూడా రాజకీయం చేసిన ఘనత కాషాయ నేతలకే దక్కుతుంది. బతుకమ్మ పాటలకు వక్రభాష్యం చెప్పేలా పాటలను తెచ్చి తెలంగాణలో విష సంస్కృతి నింపుతున్నారు బీజేపీ నేతలు.

- Advertisement -