పెట్రోల్-డీజిల్ ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. శనివారం కూడా పెట్రోల్, డీజిల్ మరింత దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కె ట్లో క్రూడాయిల్ భారీగా తగ్గడంతో దేశీయంగా ధరలను తగ్గిస్తున్నాయి ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థలు. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 32 పైసలు తగ్గి రూ.75.25కి, డీజిల్ మరో 40 పైసలు తగ్గి రూ.70.16 వద్దకు చేరుకున్నాయి.
ఇతర మెట్రో నగరాలలో ఇందన ధరలు ఇలా ఉన్నాయి…
కోల్‌కతా, ముంబైలలో పెట్రోల్ 31 పైసలు తగ్గగా, చెన్నైలో 34 పైసలు తగ్గింది. ఇక డీజిల్ ధర 40 నుంచి 43 పైసల వరకు తగ్గింది. హైదరాబాద్‌లో 34 పైసలు తగ్గిన పెట్రోల్ ధర రూ.79.78 వద్దకు, డీజిల్ మరో 43 పైసలు తగ్గి రూ.76.34 వద్దకు చేరుకున్నది. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ తగ్గడంతో బ్యారెల్ ధర ఒకేరోజు 3.34 డాలర్లు లేదా 5.3 శాతం తగ్గి 59.26 డాలర్లకు పడిపోయింది. అక్టోబర్ 2017 తర్వాత ఇదే తక్కువ ధర. ఇంధన ఉత్పత్తిని మరింత పెంచుతున్నట్లు ఆయా దేశాలు ప్రకటించడంతో ధరలు దిగువముఖం పట్టాయి.