కరోనా లక్షణాలుంటే సమాచారం ఇవ్వండి : హరీష్ రావు

136
harish rao

కరోనా వ్యాధి లక్షణాలుంటే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు మంత్రి హరీష్ రావు. సిద్ధిపేట జిల్లా లో కరోనా పాజిటీవ్ వచ్చిన వ్యక్తి తిరిగిన గ్రామలైన మిడిదొడ్డి మండలం మాదన్న పేట, దౌల్తాబాద్ మండల అహ్మద్ నగర్ గ్రామాల్లో పర్యటించారు హరీష్.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కరోనా వ్యాధి చెప్పుకుంటే తొందరగా నయం అవుతుంది…చెప్పుకోక పోతే చాలా నష్టం చేస్తుందన్నారు. వ్యాధి లక్షణాలు ఉంటే డాక్టర్ల కు సమాచారం ఇవ్వాలన్నారు.

అహ్మద్ నగర్ కు చెందిన వ్యక్తి ఎవర్ని కలిసినా చెప్పాలి.. చెప్పక పోతే ఆకుటుంబమే నష్ట పోతుందన్నారు. కరోనా వచ్చినంత మాత్రాన అదేదో నేరం చేసినట్టు కాదు..అందులో సిగ్గు పడాల్సింది ఏమీ లేదన్నారు. వ్యాధి సోకిన వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా మంచి వైద్యం అందించి బాగు చేస్తుంది.. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దన్నారు.