సూర్యాపేటలో డ్రోన్‌ కెమెరాతో పర్యవేక్షణ..

153
suryapet

సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం కుడకుడ గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఆ గ్రామంలో డ్రోన్ కెమెరాతో పర్యవేక్షణ చేపట్టారు జిల్లా ఎస్పీ భాస్కరన్‌. గ్రామంలో పరిస్థితులను డ్రోన్స్‌ ద్వారా పరిస్థితులను సమీక్షించారు.

వైరస్ వ్యాప్తి చందకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవడం జరిగినది. పోలీసు శాఖ గ్రామంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేసి 144 సెక్షన్ అమలు చేయడం జరిగినది.

గ్రామంలో ప్రజలకు మరింత భద్రత కల్పించడం కోసం పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. భద్రత పర్యవేక్షణలో భాగంగా జిల్లా ఎస్పీ,పోలీసు టెక్నీకల్ టీమ్ డ్రోన్ కెమెరాలతో గ్రామంలో పరిస్థితులు పర్యవేక్షణ చేశారు.