8న విపక్ష నేతలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

114
modi

ఈ నెల 8న విపక్షాలతో ప్రధాని నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో విపక్షాలతో మాట్లాడాలని నిర్ణయించారు.

వివిధ పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చించనున్నారు. ఉభయ సభల్లో కలిపి 5గురికి మించి సభ్యులున్న అన్ని పార్టీల నేతలతో మాట్లాడనున్నారు. ఈనెల 8న ఉదయం 11గం.లకు విపక్షాల నేతలతో మాట్లాడనున్నారు.