రివ్యూ: పెంగ్విన్

1707
penguin review

హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘పెంగ్విన్’. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాను స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, ప్యాష‌న్ స్టూడియోస్ ప‌తాకంపై నిర్మించారు. కరోనా కారణంగా థియేటర్లు ఇంకా తెరచుకోకపోవడంతో ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో ఎక్స్‌క్లూజివ్‌గా ఇవాళ విడుదలైంది. మరి పెంగ్విన్‌తో కీర్తి సురేష్ ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..

కథ:

రఘు (లింగ),రిథమ్ (కీర్తీ సురేష్) భార్య భర్తలు. ఒక్కగానొక్క కొడుకు అజయ్‌ని ఏ లోటు రాకుండా పెంచుకుంటారు. అయితే ఫ్రెండ్స్‌లో కలిసి ఆడుకోవడానికి వెళ్లిన అజయ్ కిడ్నాప్ అవుతాడు. సీన్ కట్ చేస్తే చనిపోయాడనుకున్న అజయ్ కొద్దిరోజులకు తిరిగివస్తాడు..కానీ అజయ్‌కు అపాయం తలపెట్టేందుకు చాప్లిన్ వేషధారి వెంటాడుతుంటాడు. విషయం తెలుసుకున్న రిథమ్ తన బిడ్డను వెంటాడుతున్న వ్యక్తిని ఎలా కనిపెట్టింది…?అజయ్‌తో పాటు కిడ్నాపైన పిల్లలను ఎవరు ఎలా కాపాడిందనేదే పెంగ్విన్ కథ.

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ ఫస్టాఫ్, స్క్రీన్ ప్లే, కీర్తి సురేశ్ నటన, సాంకేతిక విభాగం. మహానటితో జాతీయ స్ధాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేశ్‌ తొలిసారి ఓ థ్రిల్లర్‌లో మూవీలో నటించి మెప్పించారు. సినిమాను తన నటనతో మరోస్ధాయి తీసుకెళ్లింది కీర్తి. మిగిలిన వాళ్లు తమ పాత్రల పరిధిమేరకు ఆకట్టుకున్నారు. పరిమిత బడ్జెట్‌లో తమిళనటులతోనే సినిమా మొత్తం నడుస్తోంది.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ క్లైమాక్స్‌, సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు. సినిమాకు మూలమైన అజయ్‌ని కిడ్నాప్ చేయడం వెనుక కారణం చాలా సిల్లీగా అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్. దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ ఎంచుకున్న పాయింట్ పాతదే అయినా కథనం ఆకట్టుకుంటుంది. ఉత్కంఠ భరిత సన్నివేశాలతో సినిమాను నడిపించాడు. సంతోష్ నారాయణ్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రకృతి అందాలను అందంగా తీర్చిదిద్దారు. ఎడిటింగ్ బాగుంది.

తీర్పు:

తక్కువ బడ్జెట్‌లో సరికొత్త కథనంతో ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కించిన చిత్రం పెంగ్విన్‌. ఫస్టాఫ్ , కీర్తి సురేశ్ నటన సినిమాకు ప్లస్ పాయింట్ కాగా క్లైమాక్స్‌ మైనస్ పాయింట్‌. ఓవరాల్‌గా థ్రిల్లర్‌ మూవీలంటే ఇష్టపడే వారికి నచ్చే మూవీ పెంగ్విన్‌.

విడుదల తేదీ:19/06/2020
నటీనటులు: కీర్తి సురేశ్, ఆది దేవ్
సంగీతం:సంతోష్ నారాయణ్
నిర్మాత: కార్తీక్ సుబ్బరాజ్
దర్శకత్వం:ఈశ్వర్ కార్తీక్