12సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న ‘రెడీ’ మూవీ

304
Ready movie
Ready movie
- Advertisement -

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పొత్తినేని హీరోగా న‌టించిన రెడీ మూవీ విడుద‌ల‌య్యి నేటితో 12 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. ఈ మూవీతో రామ్ మంచి న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రామ్, జెనిలియా జంట‌గా న‌టించిన ఈచిత్రం ఆరోజుల్లో భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్ పై నిర్మాత స్ర‌వంతి ర‌వి కిషోర్ నిర్మించారు. త‌నికెళ్ల భ‌ర‌ణి, సునీల్, బ్ర‌హ్మ‌నందం, చంద్ర‌మోహ‌న్, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డిలు ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.న‌వ‌దీప్, త‌మ‌న్నాలు అతిధి పాత్ర‌ల్లో న‌టించారు.

దేవీ శ్రీ ప్ర‌సాద్ ఈసినిమాకు సంగీతం అందించారు. ఈసినిమా పాట‌ల‌కు అధ్బ‌త‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఈసినిమా తెలుగులో భారీ విజ‌యం సాధించ‌డంతో త‌మిళ్, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రిమేక్ చేశారు. ఈ మూవీకి ఉత్తమ‌‌ సినిమా, ఉత్తమ‌‌ ద‌ర్శ‌కుడు, ఉత్తమ క‌మెడియ‌న్ అవార్డులు వ‌చ్చాయి. ఈ సినిమాకు గాను బ్ర‌‌హ్మ‌నందంకు నంది అవార్డు ల‌భించింది. ఈమూవీ విడుద‌లై 12 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ప‌ల‌వురు సినీ ప్ర‌ముఖులు చిత్ర యూనిట్ కు అభినంద‌న‌లు తెలుపుతున్నారు.

- Advertisement -