త్రివిక్రమ్ – పవన్ కాంబోలో మరో చిత్రం..!

58
pawan

పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్‌ కథానాయకుడిగా డైరెక్టర్‌ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో మూవీ రానునట్లు ఒక వార్త ఇండస్ట్రీలో చకర్లు కొడుతోంది. దాదాపు ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రావడమనేది ఖాయమనే చెప్పుకుంటున్నారు. త్రివిక్రమ్ .. పవన్ కాంబినేషన్ కి ఎంతో క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. వీరి కాంబోలో ఇదివరకే ‘జల్సా’ .. ‘అత్తారింటికి దారేది’ వంటి భారీ హిట్లు వచ్చాయి. ‘అజ్ఞాతవాసి’ ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఈ ఇద్దరి కలయికలో మరో సినిమా రావాలనే అభిమానులు కోరుకుంటున్నారు. మరో రెండేళ్లలో అభిమానుల కోరిక తీరనుందనే చెప్పొచ్చు.

పవన్ ప్రస్తుతం క్రిష్.. సాగర్ చంద్ర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆ తరువాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో చేయనున్నారు. ఈ లోగా మహేశ్ బాబు మూవీని త్రివిక్రమ్ పూర్తిచేయనున్నాడు. ఆ తరువాత పవన్ – త్రివిక్రమ్ కలిసి సెట్స్ పైకి వెళతారని అంటున్నారు. ఇది పాన్ ఇండియా మూవీ అనీ .. భారీ స్థాయిలో నిర్మితం కానున్న ఈ సినిమాను వివిధ భాషల్లో విడుదల చేయనున్నారని తెలుస్తోంది. పవర్‌ స్టార్‌ను పాన్ ఇండియా స్టార్‌గా త్రివిక్రమ్ పరిచయం చేయనుండటం పట్ల ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.