రాష్ట్రంలో కొత్తగా 1,771 కరోనా కేసులు నమోదు..

29
covid-19

తెలంగాణలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,771 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 2,384 మంది చికిత్సకు కోలుకొని అసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. 13 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు 6,02,089కి పెరిగాయి. వీరిలో 5,76,487 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇంకా 22,133 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మొత్తం మరణాలు 3,469కి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 1,20,525 శ్యాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ నివేదికలో వెల్లడించింది.