దివ్యాంగులకు సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి- మంత్రి కొప్పుల

48
minister koppula

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన నాటి నుండి రాష్ట్రంలోని దివ్యాంగులకు అన్ని తానై వారికి అండగా భరోసాగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిలుస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 50 మంది దివ్యాంగులకు సహాయ ఉపకరణాల (ట్రై సైకిళ్లు) ను పంపిణీ చేశారు మంత్రి కొప్పుల. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులకు అన్ని తానై నిలుస్తున్నారు సీఎం కేసీఆర్. వికలాంగులకు 3వేల రూపాయలు పించన్ అందించి వారిని గౌవరంగా జీవించేలా సిఎం తోడ్పటు అందిస్తున్నారన్నారు.

దివ్యాంగులకు మావెల్ సైకిల్‌తో ఇబ్బందులు పడుతున్నరని వారిని ప్రత్యేకంగా బ్యాటరీ ట్రై సైకిళ్లు అందించడం జరుగుతుందని, ఈ బ్యాటరీ సైకిల్ దాదాపు 40 కిలోమీటర్లవరకు 25 కిలో మీటర్ల వేగంతో నడుస్తుందని, వికలాంగులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. అదే విధంగా చంకకర్రలు, లాప్ టాప్ లు ఇతర పరికరాలు అందించడం జరుగుతుందన్నారు.దివ్యాంగులకు సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నరని మంత్రి అన్నారు.

రామగుండంలో డఫ్ అండ్ డమ్ విద్యార్ధులకు పాఠశాల ఏర్పాటు చేయాలని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ కోరారని, విద్యాలయం ఏర్పాటుకు ప్రయత్నం చేస్తామన్నారు మంత్రి కొప్పుల. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, మేయర్ అనిల్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు పాల్గొన్నారు.