హ్యాపీ బర్త్ డే…’ఏజెంట్’ సురేందర్ రెడ్డి

209
surender reddy
- Advertisement -

అతనొక్కడే సినిమాతో మెగాఫోన్ పట్టిన దర్శకుడు సురేందర్ రెడ్డి. సినిమా సినిమాకు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ అగ్రహీరోల అటెన్షన్ కొట్టేశారు సురేందర్ రెడ్డి. కిక్,కిక్ 2లాంటి కామెడీ సినిమాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా సైరా నరసింహారెడ్డిని తెరకెక్కించిన సురేందర్ రెడ్డి బర్త్ డే నేడు.

కరీంనగర్ జిల్లాలోని మాచినపల్లిలో జన్మించారు సురేందర్ రెడ్డి. డిగ్రీకి మధ్యలోనే గుడ్ బై చెప్పేసి హైదరాబాదు వచ్చేశాడు. 2005లో కళ్యాణ్‌ రామ్ హీరోగా తెరకెక్కిన అతనొక్కడే సినిమాతో దర్శకుడిగా మారారు.

తర్వాత 2006లో ఎన్టీఆర్ హీరోగా అశోక్,2007లో మహేశ్‌తో అతిథి,2009లో రవితేజతో కిక్,2011లో ఎన్టీఆర్‌తో ఊసరవెళ్లి,2014లో అల్లు అర్జున్‌తో రేసుగుర్రం,2015లో కిక్‌ 2,2016లో ధృవ,2018లో మెగాస్టార్‌తో సైరా నర్సింహారెడ్డి సినిమాలను తెరకెక్కించి రాణించారు. ప్రస్తుతం అఖిల్‌తో ఏజెంట్ సినిమాను తెరకెక్కిస్తున్న సురేందర్ రెడ్డి హిట్ కొట్టాలని greattelangaana.com మనస్పూర్తిగా కొరుకుంటోంది.

- Advertisement -