పార్టీ నడపడం చాలా కష్టం: పవన్

42
pawan

ఏపీ అమరావతిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేనాని, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌. ఎన్ని కష్టాలు ఎదురైనా జనసేన జనంతోనే ఉంటుందని చెబుతూనే ప్రస్తుత పరిస్ధితుల్లో పార్టీ నడపడం సాహసోపేతమైన చర్యని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఎంతోమంది జన సైనికులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కష్టకాలంలో జన సైనికులు ఎంతోమంది సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారని వారందరికీ అభినందనలు తెలిపారు. పార్టీ తరపున లక్ష మంది కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారు.

ఈ బీమా పథకానికి తనవంతుగా కోటి రూపాయలు అందించానని.. ప్రజాస్వామ్య విలువలను కాపాడటానికి జనసేన ఎప్పుడూ కృషిచేస్తుందన్నారు. ఈ సందర్భంగా నంద్యాలలో మృతిచెందిన జనసేన కార్యకర్త ఆకుల సోమేశ్‌ కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల చెక్‌ను అందించారు పవన్.