నాని..నిన్నుకోరికి నాలుగేళ్లు..

142
nani

ఒక్కో సినిమాతో దర్శక నిర్మాతలకి తనపై గల నమ్మకాన్ని .. తన సక్సెస్ రేటును పెంచుకుంటూ వెళుతున్నాడు నాని. నిర్మాతల పాలిట కల్పవృక్షంగా మారిన నాని హీరోగా మళయాళం బ్యూటీ నివేదా థామస్ జంటగా నటించిన సినిమా ‘నిన్నుకోరి’. సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది.

2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించగా, డివివి దానయ్య నిర్మించారు. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలవగా ఉమామహేశ్వర్‌గా నాని, అరుణ్‌గా ఆది పినిశెట్టి అద్భుత నటన కనబర్చారు. ప్రేమలో విఫలమైన యవకుడిని మానవత్వం,భర్త సహకారంతో హీరోయిన్‌ ఎలా గాడిలో పెట్టిందనే కాన్సెప్ట్ అందరిని ఆకట్టుకుంది.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ సినిమాకు మంచి క్రేజ్ లభించడంతో వరల్డ్ వైడ్‌గా నిన్ను కోరి సినిమా మొత్తం రూ. 35 కోట్ల షేర్ సాధించినట్టు ట్రేడ్ వర్గాల అంచనా. సినిమా కోసం వెచ్చించిన బడ్జెట్ కన్నా ఎక్కువ లాభాలు సాధించిన సినిమా ఇది . గోపీ సుందర్ అందించిన మ్యూజిక్ సినిమాకు మరో హైలైట్‌గా నిలిచింది.