చైతూ…లవ్ స్టోరి రిలీజ్ డేట్ ఖరారు..?

52
Love story

హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మూవీ ‘లవ్ స్టోరీ’.ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న ఈ అందమైన ప్రేమ కథ అక్కినేని అభిమనుల్లో, ప్రేక్షకుల్లో అమిత ఆసక్తిని కలిగించింది. ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

కరోనా సెకండ్ వేవ్ తగ్గడంతో సినిమా విడుదల తేదీపై మేకర్స్ సమాలోచనలు జరుపుతున్నారు. జులై నెలాఖరున ఈ సినిమాను థియేటర్లకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారట.

లవ్ స్టోరీ సినిమాను జులై 30న విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తుంది. టాలీవుడ్ మ్యాజికల్ దర్శకుడిగా పేరున్న శేఖర్ కమ్ముల కంప్లీట్ ప్రేమకథా చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కించగా ఇప్పటికే సారంగ దరియా పాట సినిమా మీద భారీ అంచనాలను పెంచేసింది.