బీజేపీ దోస్తీకి పవన్ గుడ్ బై.. కారణమదే?

44
- Advertisement -

టీడీపీ జనసేన పార్టీలు అధికారకంగా పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. జనసేన అధ్యక్షుడు పవన్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే బీజేపీతో పొత్తు కొనసాగుతుందా లేదా అనే దానిపై మాత్రం ఆచితూచి స్పందించారయన. టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో ఎన్డీయే పెద్దలకు వివరిస్తామని చెప్పిన పవన్.. రాష్ట్ర బీజేపీ గురించి మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మొదటి నుంచి కూడా బీజేపీతో పొత్తు ఉంటుందని చెబుతూ వచ్చిన పవన్.. టీడీపీతో పొత్తు ప్రకటించిన తరువాత మాత్రం అసలు స్పందించడం లేదు. .

కానీ రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం జనసేనతో తమ పొత్తు ఉంటుందని చెబుతూ వస్తున్నారు. అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాల ఆధారంగా టీడీపీ జనసేన కూటమికి మద్దతు ప్రకటిస్తేనే బీజేపీతో పొత్తులో ఉండాలని పవన్ భావిస్తున్నారట. లేదంటే ఎన్డీయే కూటమి నుంచి కూడా బయటకు రావాలని భావిస్తున్నారట. అయితే గతంలో టీడీపీతో జరిగిన పరాభావాల కారణంగా టీడీపీతో కలవడానికి బీజేపీ సంకోచిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం చంద్రబాబు జైల్లో ఉండడంతో టీడీపీ, టీడీపీ జనసేన కూటమికి మద్దతు ఇవ్వడానికి ఒక మెలిక పెట్టరట కాషాయ పార్టీ పెద్దలు.

Also Read:కడియంకు మద్దతు ప్రకటించిన రాజయ్య..

కూటమి ఉమ్మడి సి‌ఎం అభ్యర్థిగా ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిని ప్రకటించాలని బీజేపీ పెద్దలు డిమాండ్ చేస్తున్నారట. దాంతో పవన్ బీజేపీతో తెగతెంపులు చేసుకునేందుకు సిద్దమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. టీడీపీ జనసేన మద్య సి‌ఎం అభ్యర్థి ఎవరనేది ఇంకా సస్పెన్స్ లోనే ఉండగా బీజేపీ తమ అభ్యర్థిని సి‌ఎం గా ప్రకటించాలని కోరుతుండడం పవన్ కు నచ్చడం లేదని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే బీజేపీ పొత్తు కు గుడ్ చెప్పి టీడీపీతో పొత్తును బలోపేతం చేసుకోవాలని పవన్ భావిస్తున్నారట. మరి ఈ పొత్తు రాజకీయాలు ముందు రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.

Also Read:ఆమె స‌మంతను మారుస్తానంటుంది

- Advertisement -