ఆమె స‌మంతను మారుస్తానంటుంది

21
- Advertisement -

ఖుషి సినిమాతో రీసెంట్‌ గా ప్రేక్ష‌కుల్ని ప‌ల‌కరించిన స‌మంత‌, ఆ సినిమాతో ఫ్లాప్‌ ను అందుకుంది. ఫ్లాప్‌ తో పాటూ మునుప‌టిలా స‌మంత అందం లేదంటూ కామెంట్లు కూడా వ‌చ్చాయి. రీసెంట్‌గా ఇన్‌స్టా చిట్‌చాట్‌లో స‌మంత దీనిపై స్పందించిన సంగతి తెలిసిందే. తాజాగా సమంత బెస్ట్ ఫ్రెండ్ చిన్మ‌యి స‌మంతను మారుస్తాను అంటుంది. సమంత త‌న చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ వాడ‌టం వ‌ల్ల ఆమె ఫేస్ పాడైంద‌ని, త‌న‌ను మళ్లీ గ్లాసీ లుక్‌లోకి తాను మారుస్తాన‌ని చిన్మ‌యి చెప్పుకొచ్చింది. మరి చిన్మ‌యి చెప్పినట్టు.. ఆమె స‌మంతను మారుస్తొందో లేదో చూడాలి.

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది శాకుంత‌లం, ఖుషి సినిమాల‌తో డిజాస్ట‌ర్లు అందుకున్న స‌మంత‌, ప్ర‌స్తుతం సినిమాల‌కు గ్యాప్ ఇచ్చింది. అయితే తన గ్యాప్ తర్వాత మళ్ళీ తాను రీఎంట్రీ ఇస్తానని.. తన రీఎంట్రీలో చాలా కొత్త కథల్ని ఎంచుకుంటానని చెబుతుంది. గతంలో తనకు ఇష్టం లేకపోయినా.. కొన్ని సినిమాలు చేశాను అని, ఐతే ఇక నుంచి త‌న రూట్ మార్చ‌నున్న‌ట్లు తెలిపింది. ఇక‌పై స్టోరీ సెలెక్ష‌న్ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉంటాన‌ని, త‌న‌కు సెట్ అయ్యే పాత్ర‌ల‌ను మాత్ర‌మే చేయ‌నున్న‌ట్లు స‌మంత వెల్ల‌డించింది.

Also Read:ఒత్తిడి ఎక్కువైతే.. అల్జీమర్ వ్యాధి వస్తుందా?

సమంత మళ్లీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందనే విషయంపై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. ఆమె ఓ వ్యక్తితో లవ్‌లో పడిందనే ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై క్లారిటీ ఇస్తూ ఇప్పటికే సమంత వివరణ ఇచ్చింది. తాను ప్రస్తుతం మళ్లీ ప్రేమలో పడే ఆలోచనలో లేను అని, తన ఫోకస్ మొత్తం తన ఆరోగ్యం పైనే ఉందని చెప్పుకొచ్చింది.

Also Read:IND VS AUS:తొలి మ్యాచ్‌ లో సత్తా చాటేదేవరు?

- Advertisement -