బాక్సాఫీస్ వద్ద సమ్మర్ సినిమాల సందడి మొదలైంది. ఈ వేసవిలో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు వస్తున్నారు అగ్ర హీరోలు. ఈనెల 28న విడుదలయ్యే నితిన్ రాబిన్‌హుడ్ , సితార సంస్థ నుంచి వస్తున్న మ్యాడ్ స్క్వేర్ తో వేసవి సినిమాల సందడి మొదలుకానుంది.
సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జాక్’ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజు తమిళ స్టార్ అజిత్ కథానాయకుడిగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ , హిందీ తార సన్నీ దేవోల్ కథానాయకుడిగా తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన జాట్ సినిమాలు విడుదలవుతున్నాయి.
ప్రదీప్ మాచిరాజు కథానాయకుడిగా నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలకృష్ణ క్లాసిక్ చిత్రం ‘ఆదిత్య 369’ ఏప్రిల్ 11న 4కే హంగులతో రీ రిలీజ్ కానుంది. ప్రియదర్శి…సారంగపాణి జాతకం, ఏప్రిల్ 25న మంచు విష్ణు ‘కన్నప్ప’ విడుదల కానుంది.
అలాగే నాని స్వయంగా నిర్మిస్తున్న ‘హిట్’ ఫ్రాంచైజీ ‘హిట్ 3’ మే 1న విడుదల కానుండగా మే 9న పవన్‌కల్యాణ్ ‘హరి హర వీర మల్లు’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా సమ్మర్‌లో మరింత హీట్ పెంచేందుకు హీరోలు సిద్ధమవుతుండగా ఎంతమంది హిట్ కొడతారో వేచిచూడాలి.
Also Read:సునీతా విలియమ్స్ ఆరోగ్యంపై నాసా

