పాపం పవన్‌.. పోటీ చేసిన రెండు చోట్లా వెనుకంజ..!

248
Pawan Kalyan

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.. జనసేన అధినేత, నటుడు పవన్‌కల్యాణ్‌ పోటీ చేసిన గాజువాక, భీమవరం రెండు నియోజకవర్గాల్లో వెనుకంజలో ఉన్నారు. 101 స్థానాల్లో వైసీపీ, 23 స్థానాల్లో టీడీపీ, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

మరోవైపు గుంటూరు జిల్లా తెనాలి, తూర్పుగోదావరి జిల్లా ముమ్ముడివరంలో జనసేన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఆరంభ ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా వైకాపా 121 కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తుండగా.. తెదేపా 29 స్థానాల్లో ముందంజలో ఉంది.

Pawan Kalyan Gajuwaka constituency Election Result