బిజెపి వల్లే..1458 తెలంగాణ బలిదానాలు

160
Pawan
- Advertisement -

ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఉద్యమిస్తున్న జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌ ట్విట్టర్ ద్వారా బీజేపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు గుప్పించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో అధికారంలోకి వచ్చి మాట మార్చిన బీజేపీ.. గతంలో తెలంగాణ విషయంలో కూడా అలానే చేసిందంటూ ట్విట్ చేశాడు. 1997లో బీజేపీ ఒక ఓటు, రెండు రాష్ట్రాలు తీర్మానం చేసింద‌ని, తర్వాత అధికారంలోకి వ‌చ్చిన బీజేపే మళ్లీ ప్ర‌త్యేక తెలంగాణ ఊసును ఎత్త‌లేద‌ని అన్నారు. దాని ప‌ర్య‌వ‌సానంగా నిండు నూరేళ్లు బ‌త‌కాల్సిన 1458 మంది తెలంగాణ యువ‌కులు బ‌లిదానాలు చేశార‌ని ఆయ‌న అన్నారు.

ఒక సున్నితమైన స‌మ‌స్య‌ని, అనేక కోట్ల మంది భ‌విష్య‌త్తుతో ముడిప‌డి ఉన్న స‌మస్య‌ని 17 సంవ‌త్స‌రాలు నాన్చి, 12 గంట‌ల్లో తేల్చేశార‌ని పేర్కొన్నారు. ఇదే నా మీరు చెబుతున్న సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం మీకు నేర్పింది? అని ఆయన ప్ర‌శ్నించారు. అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల సమయంలో బీజేపీ ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. కానీ అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా కాకుండా..స్పెషల్‌ ప్యాకేజీతో సరిపెట్టింది. దీంతో రాష్ట్ర్ర వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదాను డిమాండ్ చేస్తూ రేపు విశాఖ‌పట్నంలోని ఆర్కే బీచ్‌లో రాష్ట్ర యువ‌త మౌన దీక్షను చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రజల అంక్షాను కేంద్రానికి తెలియజేసేలా నిరసన తెలుపనున్నారు. పవన్ కూడా ఈ సమావేశానికి పూర్తీ మద్దతు తెలపనున్నాడు. కానీ ఈ నిరసనకు ఏపీ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో పవన్ ఇటు ఏపీ ప్రభుత్వంపై అటు కేంద్ర ప్రభుత్వంపై ట్విట్టర్ వేదిక విమర్శలు చేస్తున్నాడు.

- Advertisement -