పవన్ కళ్యాణ్ ది ఏ కులంః ఎమ్మెల్యే రాజాసింగ్

313
Rajasingh Pawan Kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. పవన్ కళ్యాణ్ హిందువులను అవమానించారని అన్నారు. ఈమేరకు ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేశాడు. హిందూమతంపై కనీస అవగాహన లేకుండా పవన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘పవన్‌‌ది ఏ మతం? అతడు మతం మార్చుకున్నాడా?’ అని ప్రశ్నించారు. హిందూ మతాన్ని టార్గెట్‌గా చేసి  మట్లాడం సరైనది కాదన్నారు. పవన్‌ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు.

కాగా ఇటివలే పవన్ కళ్యాణ్ తిరుపతిలో జనసేన కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. మత రాజకీయాలు చేసేది హిందూ రాజకీయ నేతలేనని..హిందు రాజకీయ నాయకుల వల్లే మత కలహాలు వస్తున్నాయని అన్నారు. ఇతర మతాల నేతలు ఇలాంటి పనులు చేయరన్నారు. తాను చిన్నప్పటి నుంచి వింటోంది ఒకటేనని.. సెక్యులరిజాన్ని ఇబ్బంది పెడుతోంది హిందూవులు మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఇక రాజాసింగ్ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్‌ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.