తమ్ముడి బాట పట్టిన నాగబాబు..

192
nagababu
- Advertisement -

పవన్ గురించి ఫ్యాన్స్ అడిగిన ప్రతిసారీ అసహనం వ్యక్తం చేసిన నాగబాబు..ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మాత్రం పవన్ ఆందోళనకు జై కొట్టారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, ఆ హక్కు కోసం పోరాడుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు, ఇతర రాజకీయ పార్టీలకు, ఆంధ్రా యూనివర్సిటీ జేఏసీ స్టూడెంట్స్‌కు, మెగా ఫ్యాన్స్‌కు, పవన్ ఫ్యాన్స్‌కు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని నాగబాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పవన్ కల్యాణ్ ఆదర్శాలతో, అతని ఆలోచనా విధానంతో తాను సంపూర్తిగా ఏకీభవిస్తున్నానని నాగబాబు పేర్కొనడం విశేషం. విశాఖ ఆర్కే బీచ్‌లో 26న జరగబోయే శాంతి ర్యాలీకి తన మద్దతు ఉంటుందని నాగబాబు చెప్పారు.

ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీ యువత ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 26న విశాఖ ఆర్కే బీచ్‌లో జరగబోయే ఆందోళన కార్యక్రమానికి ఇప్పటికే సినీ పరిశ్రమ నుంచి చాలామంది హీరోలు మద్దతు తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ ఆందోళనను భుజానికెత్తుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వరుస ట్వీట్స్‌ అటు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే..ఇటు యువతలో చైతన్యం నింపై ప్రయత్నం చేస్తున్నాడు. ప్రత్యేక హోదా కోసం యువత చేస్తున్న పోరాటానికి మద్దతుగా బుధవారం దేశ్ బచావో పేరిట..మ్యూజిక్ అల్బమ్‌ ను కూడా పవన్ విడుదల చేశాడు.

https://youtu.be/pja9OsJi1dg

- Advertisement -