దర్శకుడు హరీష్ శంకర్- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో భవదీయుడు భగత్ సింగ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రారంభం అయిన దగ్గరి నుండి అప్డేట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు హరీష్‌ని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తుండగా దీనిపై ఓ ఇంటర్వ్యూలో ఘాటుగా స్పందించారు.
పవన్ కళ్యాణ్ తో చేసే సినిమా రీమేకా కాదా అనేది నేను చెప్దామనుకున్నాను. కానీ ఫ్యాన్స్ చాలా ఓవర్ చేశారు. కొంతమంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అతిగా రియాక్ట్ అయ్యారు. నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని వాళ్లకి కూడా తెలుసు. ఫ్యాన్స్ అంటే నాకు తమ్ముళ్లు లాంటి వాళ్ళు. కానీ ఈ సమయంలో మాత్రం కొంతమంది ఫ్యాన్స్ ఎక్కువ చేశారు. అందుకే పవన్ సినిమా రీమేకా కాదా అనేది నేను చెప్పను డైరెక్ట్ రిలీజ్ అయ్యాక థియేటర్స్ లో చూసుకుంటారు అని తెలిపారు.
అయితే ఇదే సినిమా గురించి స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేస్తున్న దశరథ్ …ఇది తేరి సినిమాకు రీమేక్. కేవలం మెయిన్ లైన్ మాత్రమే తీసుకొని పూర్తిగా పవన్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే మారుస్తున్నామని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో హరీష్‌ని టార్గెట్ చేస్తూ ఈ సినిమా గురించి నువ్వేమీ చెప్పాల్సిన అవసరం లేదు..మాకు క్లారిటీ వచ్చేసింది అని తేల్చి చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..