టీడీపీతో పొత్తు.. పవన్ క్లారిటీ ఇస్తారా?

728
pawan
- Advertisement -

గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో టీడీపీ, జనసేన మద్య పొత్తు అంశం పదే పదే చర్చలోకి వస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని చూస్తున్న చంద్రబాబు.. జనసేనతో కలిస్తే విజయం మరింత చేరువౌతుందనే ఆలోచనలో ఉన్నారు. అందుకే పవన్ తో చేతులు కలిపేందుకు చంద్రబాబు ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు వైసీపీ వ్యతిరేక ఓటు చిలనివ్వమని పవన్ చెబుతూ పొత్తులకు సంబంధించిన సంకేతాలను ఇస్తున్నారు. అయితే ఈ రెండు పార్టీల మద్య పొత్తు ఉందనే విమర్శలు వైసీపీ నేతలు గట్టిగా చేస్తున్నప్పటికి.. అటు చంద్రబాబు గాని, ఇటు పవన్ గాని ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

అయితే ఆ మద్య విశాఖపట్నంలో పవన్ తో చంద్రబాబు భేటీ కావడంతో ఈ రెండు పార్టిల పొత్తు కన్ఫర్మ్ అనే వాదన కూడా బలంగా నడిచింది. అయితే జనసేన ఇప్పటికే బిజెపితో పొత్తులో ఉంది. కానీ బీజేపీ మాత్రం టీడీపీతో కలిసేందుకు సిద్దంగా లేదు. అందుకే పవన్ టీడీపీతో పొత్తు ను కన్ఫర్మ్ చేయలేక పోతున్నారనేది కొందరి అభిప్రాయం. ఒకవేళ జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి దూరం అవ్వాల్సి వస్తుంది. అలా కాకుండా ప్రస్తుత రాజకీయ సమీకరణలు చూస్తే ఈ మూడు పార్టీలు కలిసే అవకాశం కూడా కనిపించడం లేదు. అటు టీడీపీకి ఇటు బీజేపీకి రెండు పార్టీలకు జనసేన అవసరం గట్టిగానే ఉండడంతో పవన్ చూపు ఎటువైపు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో పవన్.. నందమూరి బాలకృష్ణ టాక్ షో ఆన్ స్టాపబుల్ కు గెస్ట్ గా రానున్నారు. ప్రస్తుతం బాలయ్య టీడీపీ నుంచి హిందూపూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాగా తన టాక్ షోలో సరదా సంబాషణలతో పాటు, కాంట్రవర్సీ క్వశ్చన్స్ కూడా అడిగే బాలయ్య.. పవన్ పై పొత్తులకు సంబందించిన ప్రశ్నలు సంధిస్తారా లేదా అనే దానిపై అందరిలోనూ క్యూరియాసిటీ నెలకొంది. ఒకవేళ రాజకీయ పరంగా పొత్తులకు సంబంధించిన ప్రశ్నలు బాలయ్య సంధిస్తే.. పవన్ ఎలాంటి సమాధానం ఇస్తారనేది కూడా ఆసక్తికరమే. మరోవైపు బాలయ్య షో కు పవన్ హాజరు కావడంపై వైసీపీ సెటైర్లు కురిపిస్తున్నారు. టీడీపీ జనసేన మద్య పొత్తు ఉంది అనడానికి బాలయ్య, పవన్ కలయికే సంకేతం అనే విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి బాలయ్య పవన్ ఆన్ స్టాపబుల్ ఎపిసోడ్.. అటు సినీ ఇండస్ట్రీలోనూ, ఇటు రాజకీయరంగంలోనూ హాట్ హాట్ డిబేట్లకు కారణం అవుతోంది.

ఇవి కూడా చదవండి…

రిచెస్ట్‌ సీఎమ్స్‌ ఇన్ ఇండియా…

బండి పాదయాత్రకు బ్రేక్.. అంతా కన్ఫ్యూజన్ !

దిగ్విజయ్ సింగ్‌కి కొండా లేఖ..

- Advertisement -