ప్రభుత్వ ఉద్యోగులు..ఇండైరెక్ట్‌గా ఎవరివైపో చెప్పేశారా?

17
- Advertisement -

దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైన అధికారంలోకి రావాలన్న, అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న వారి పాలన నిర్ణయాలు ఎంత కీలకమో, ప్రభుత్వ ఉద్యోగులు అంతే ముఖ్యం. ప్రభుత్వం , ఉద్యోగులు సమాంతంగా కలిసి పనిచేస్తేనే ప్రజలకు ఏ సంక్షేమ పథకమైనా అందుతుంది. అందుకే ప్రభుత్వ ఉద్యోగులను మెప్పించేలా ఏ ప్రభుత్వ పాలనైన ఉంటుంది. కొన్నిసార్లు ఉద్యోగులపై కఠినంగా వ్యవహరించినా చివరికి వారిని ప్రసన్నం చేసుకుంటేనే గెలుపు ఈజీ అవుతుందని పాలకులకు తెలిసిన సత్యం.

ఏపీలో ప్రస్తుతం పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీకి ఏకకాలంలో ఎన్నికలు జరుగుగున్నాయి. అయితే ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వ ఉద్యోగులు కీలకం కావడంతో వారికి నిన్నటి నుండి ఓటు వేసే అవకాశం కల్పించగా పెద్ద ఎత్తున ఓటు వేసేందుకు ఉద్యోగులు ఆసక్తి చూపించారు.

అయితే ఉద్యోగుల ఓటు ఎవరి వైపు అన్నదానిపైనే అందరి దృష్టి నెలకొంది. చంద్రబాబు – జగన్ పాలనను బేరీజు వేసుకున్న ఉద్యోగులు…నమ్మకం వైపే నిలబడ్డట్లు తెలుస్తోంది. జీతాల పెంపు, గ్యారెంటెడ్ పెన్షన్ స్కీమ్ కావొచ్చు మొత్తంగా కొన్ని అంశాల్లో ప్రతికూలత ఉన్న మెజార్టీ అంశాలు ఉద్యోగుల ఫ్రెండ్లీ అంశంగా ఉండటంతో పరోక్షంగా  విశ్వసనీయత వైపు నిలిచారని స్పష్టమవుతుంది.

Also Read:Nara Rohith:10న ‘ప్రతినిధి 2’

- Advertisement -