బ్లాక్ వాటర్ తాగితే.. ఇన్ని ఉపయోగాలా?

210
- Advertisement -

బ్లాక్ వాటర్.. ఈ పేరును మనం తరచూ వార్తల్లో వింటూనే ఉంటాం. సెలబ్రేటీలు లేదా క్రీడకారులు ఈ వాటర్ ను ఎక్కువగా తాగుతూ ఉంటారు. కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈ వాటర్ ను ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు చాలా మంది సెలబ్రేటీలు. అయితే అంతలా ఈ వాటర్ లో ఏముందనే డౌట్ ప్రతి సామాన్యుడికి రాక మానదు. అయితే ఈ బ్లాక్ వాటర్ లో మన నార్మల్ వాటర్ తో పోలిస్తే లవణాల గాఢత కాస్త ఎక్కువే ఉంటుంది. సాధారణంగా మనం తాగే వాటర్ లో పిహెచ్ విలువ 7 శాతం ఉంటుంది. కానీ బ్లాక్ వాటర్ లో దీని విలువ రెండు రెట్లు అధికంగా ఉంటుంది. చాలా రకాల రోగాలను ఎదుర్కొనే రోగనిరోదక సామర్థ్యం పెరుగుతుంది.

అంతే కాకుండా ఈ బ్లాక్ వాటర్ తాగడం వల్ల జీవ క్రియ కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించడంలో బ్లాక్ వాటర్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ వాటర్ లో ఉండే మినరల్స్, ఆక్సిడెంట్లు.. శరీరంలోని నీటి సమతుల్యతను పరిరక్షిస్తాయి. అందువల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. ముఖ్యంగా ఎండలో ఎక్కువ సమయం గడిపే వాళ్ళు ఈ బ్లాక్ వాటర్ తాగడం వల్ల వడదెబ్బ తాగేలే అవకాశాలు తక్కువ అని నిపుణులు చెబుతున్నారు. అందుకే క్రీడకారులు బ్లాక్ వాటర్ తడడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు.

ఇక ఇందులో ఉండే మెగ్నీషియం, కాల్షియం రక్త పోటును అదుపులో ఉంచడంతో పాటు, ఎముకల పటుత్వాన్ని మెరుగు పరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ బ్లాక్ వాటర్ మితంగా తాగడం వల్ల ఎలాంటి ప్రమాదాలు లేనప్పటికి.. అధికంగా తాగితే కొన్ని సమస్యలు వేధించే అవకాశం ఉందట. బ్లాక్ వాటర్ అధికంగా తాగడం వల్ల ఆల్కలైన్ స్థాయిపెరిగి.. గ్యాస్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే వికారం, వంతులు, చర్మ సమస్యలు, తలనొప్పి వంటి సమస్యలు చుట్టూ ముట్టె అవకాశం ఉందట. అందువల్లే బ్లాక్ వాటర్ ను పరిమితి మేర తాగాలనే నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఈ బ్లాక్ వాటర్ నార్మల్ వాటర్ తో పోలిస్తే.. అత్యంత ఖరీదైనవనే సంగతి మనందరికీ తెలిసిందే.

ఇవి కూడా చదవండి…

పచ్చి గుడ్డు తింటున్నారా.. జాగ్రత్త!

చర్మ సమస్యలకు చిట్కాలు..

పెరిగిన బంగారం ధరలు..

- Advertisement -