పార్లమెంట్ సమావేశాలు కుదింపు..

166
Parliaments
Parliaments

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదించేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 30 మంది ఎంపీలు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ క్రమంలో సమావేశాలను ఓ వారం ముందుగానే ముగించేందుకు కేంద్రం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.పార్ల‌మెంటుకు చెందిన ఇద్ద‌రు సీనియ‌ర్ అధికారులు ఈ విష‌యాన్ని అన‌ధికారికంగా వెల్ల‌డించారు.

ముందుగా సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు పార్లమెంట్ వ‌ర్షాకాల‌ సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణ‌యించింది. ఆ మేర‌కే సెప్టెంబ‌ర్ 14న స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. అయితే క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతుండ‌టంతో గ‌డువు కంటే వారం ముందుగానే స‌మావేశాల‌ను ముగించాల‌ని కేంద్రం భావిస్తున్న‌ట్లు తెలిసింది. కేంద్రం ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సమావేశాలను ప్రారంభించినా కేసులు పెరగడంతో కేంద్రం పునరాలోచనలో పడినట్లు సమాచారం.