సలాడ్’తో శరీరానికి ఎంతో మేలు..

136

చల్లచల్లని సలాడ్ లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్యం మాత్రమే కాదు, రుచికి కూడా బాగుంటాయి. పండ్లు తినని పిల్లలకు సలాడ్ ల రూపంలో చేసి పెట్టండి. తియ్య తియ్యగా తినడానికి ఇష్టపడతారు. సలాడ్ లలో పోషక విలువలు కూడా అధికం. ముందుగా తయారు చేసి ఫ్రిజ్‌లో పెట్టుకున్న ఈ సలాడ్ లను బయటికి వెళ్లి వచ్చిన తరువాత చల్లగా తింటుంటే ఆ మజానే వేరు.

Health Benefits of Mixed Fruit Salad

1. పచ్చి కూరగాయలు శరీరంలో కొవ్వు పదార్ధాల  స్ధాయిలను తగ్గించుటలో సహాయపడుతాయి.

2. సలాడ్లు మొలకెత్తిన విత్తనాలు కలిపి తినటం వలన సులభంగా జీర్ణమవుతుంది. అలగే శరీరానికి పైబర్లను, ప్రోటిన్ విటమిన్, మినరల్ లను అందిస్తాయి.

3. మన శరీరంలో బరువు తగ్గించుకోవాలి అనుకుంటే  సలాడ్ని తినాలి . సలడ్ లో పైబర్ లు ఆకలినితగ్గించే ఏజెంట్లుగా పని చేసి ఆకలి కలుగకుండా చేస్తాయి.

Health Benefits of Mixed Fruit Salad

4.గ్రీన్ సలాడ్ శక్తి వంతమైన యాంటీ ఆక్సీడెంట్ లను కలిగి ఉంటుంది. ఫోలిక్ ఆసిడ్, లైకోపీన్, విటమిన్ ‘C’ , ‘E’, ఆల్ఫా, బీటా-కేరొటీన్ వంటి వాటిని కలిగి ఉండి, శరీరానికి అందిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్ లు ఫ్రీ రాడికల్ వలన కలిగే ప్రమాదాల నుండి శరీరాన్ని కాపాడతాయి.

5. సలాడ్ వల్ల ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను శరీరానికి అందిస్తుంది. మోనోసాచురేటడ్ కొవ్వు పదార్ధాలు కలిగివుండి ఆలివ్ ఆయిల్ ,అవకాడొ, విత్తనలు శరీరంలో పైటోకెమికల్ లను గ్రహించేలా ప్రోత్సహిస్తుంది.

6.కూరగాయల సలాడ్  మలబద్దకాన్ని తగ్గించుటలో సహాయపడుతుంది.

7. పచ్చి కూరగాయలు జీర్ణవ్యవస్థను మెరుగుపరచటమేకాకుండా ,రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది

8. మనం తినే సలాడ్ లలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే స్ట్రాబెర్రీ, టమోటా, క్యారెట్, ఆపిల్, బీన్స్, పీస్, మిరియాలు, పీచెస్ వంటి వాటిని ఉండేలా చూసుకోవాలి.