రోజు ధ్యానం చేస్తే ఎన్ని ఉపయోగాలు!

16
- Advertisement -

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్య సంరక్షించుకోవడం అంత సులభమైన విజయం కాదు. ఎందుకంటే శారీరక సమస్యలతో పాటు మానసిక రుగ్మతలు కూడా చాలమందిని వెంటాడుతుంటాయి. అయితే శారీరక సమస్యలకు సరైన మెడిసిన్ ఉపయోగించి వాటి నుంచి బయట పడవచ్చు. కానీ మానసిక రుగ్మతలకు ఏ మెడిసన్ కూడా పని చేయదు. అలాంటి రుగ్మతల నుంచి బయట పడాలంటే మానసిక దృఢత్వం చాలా అవసరం. మానసిక బలాన్ని పెంచడంలో ధ్యానం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతిరోజూ ఒక పది నిముషాలు ద్యానం చేస్తే మైండ్ రీఫ్రెష్ అవుతుంది. ఇంకా ఏకాగ్రత పెరుగుతుంది. .

పని ఒత్తిడితోను, మానసిక ఆందోళనలతోనూ క్రుంగిపోతున్నవారు తప్పనిసరిగా ప్రతిరోజూ ధ్యానం చేస్తే వాటి నుంచి త్వరగా బయట పడవచ్చని చెబుతున్నారు మానసిక నిపుణులు. యోగాలో ధ్యానానికి ఎంతో ప్రత్యేక స్థానాన్ని ఇస్తారు యోగా నిపుణులు. పూర్వం నుంచి కూడా ఋషులు, మునులు కేవలం ధ్యానం చేస్తూ మనసు లఘ్నపరచుకునే వాళ్ళు. అలా చేయడం వల్ల ఆలోచనాభివృద్ది పెంచడంలోనూ, మెదడు పనితీరును మెరుగు పరచడంలోను ద్యానం ఎంతగానో సహాయపడుతుంది. రోజుకు పది నిమిషాలు డీప్ మెడిటేషన్ చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. రోజంతా ఉత్సాహంగా పని చేయడానికి ఆసక్తి కలుగుతుంది.

ధ్యానం చేయు విధానం

చాలమంది ధ్యానం చేసేటప్పుడు సరైన జాగ్రత్తలు పాటించరు. అందుకే ద్యానం ద్వారా కలిగే ఉపయోగాలు పొందలేరు. ధ్యానం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. చదునైన నేలపై కూర్చుని వెన్నెముకను నిటారుగా ఉంచి కళ్ళు మూసుకొని ధ్యానం ప్రారంభించాలి. లోతుగా శ్వాస తీసుకొని నెమ్మదిగా శ్వాస వదలాలి. ఇలా చేసేటప్పుడు ఎలాంటి ఆలోచనలు చేయకుండా కేవలం శ్వాస పైనే దృష్టి సారించాలి. ఇలా కనీసం ఒక 15 నిముషాలు చేస్తే ద్యానం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు యోగా నిపుణులు.

Also Read:KCR:దళిత,బహెజనులు ఏకంకావాలి

- Advertisement -