టాలీవుడ్‌పై కంగనా కామెంట్స్‌..

177
Kangana Ranaut

వివాదాలతో నిత్యం వార్తల్లో నిలిచే ఫైర్ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాద్ మాట్లాడుతూ దేశంలోనే అతి పెద్ద ఫిల్మ్ సిటీని తాము నిర్మించబోతున్నట్లుగా ప్రకటించాడు. ఆయన వ్యాఖ్యలపై కంగనా స్పందించింది. ప్రజలు భారతదేశంలో అతి పెద్ద సినిమా పరిశ్రమ హిందీ సినిమా పరిశ్రమ అనుకుంటున్నారు. అది తప్పు అంటూ కంగనా పేర్కొంది. ఇండియాలో పలు భాషల సినిమా పరిశ్రమలో ఉన్నాయి.

అందులో తెలుగు సినిమా పరిశ్రమ కూడా కీలకమైనది. తెలుగు చిత్ర పరిశ్రమ తనను తాను అగ్రస్థానంలో నిలుపుకుంది. బహు భాష సినిమాలు చేయడంతో పాటు పాన్ ఇండియా సినిమాలు చేయడంలో తెలుగు సినిమా ముందుంది’ అని ఆమె ట్వీట్‌ చేశారు. అలాగే నెపోటిజం, డ్రగ్‌మాఫియా, సెక్సిజం, విదేశీ సినిమా, తదితర ఎనిమిదింటిని ఉగ్రవాదంతో పోలుస్తూ.. వాటి నుంచి పరిశ్రమను కాపాడాలని ట్వీట్‌ చేసింది.