గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన ఎమ్మెల్యే జిఎంఆర్..

105
mla gmr

తన పుట్టిన రోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ నీ పటాన్‌చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్వీకరించారు. ఈ సందర్భంగా బొల్లారం మున్సిపల్ పరిధిలోని తెలంగాణ మోడల్ స్కూల్ ఆవరణలో మూడు మొక్కలు నాటారు. అనంతరం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, రామచంద్రపురం కార్పొరేటర్ అంజయ్య, భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డిలను ఎమ్మెల్యే జిఎంఆర్ నామినేట్ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తన పుట్టినరోజును పురస్కరించుకొని ఎంపీ సంతోష్ కుమార్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మొక్కలు నాటాలని కోరుతూ గ్రీన్ ఛాలెంజ్ కి తనని నామినేట్ చేయడం సంతోషకరంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా గ్రీన్ చాలెంజ్ ఉద్యమానికి మంచి స్పందన లభిస్తోందన్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవల సినీ నటుడు ప్రభాస్ తమ నియోజకవర్గ పరిధిలోని కాజిపల్లి అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకోవడమే అన్నారు.