నెంబర్ ఒన్.. తెలంగాణే !

64
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికారం చేపట్టిన కే‌సి‌ఆర్ తన సుపరిపాలనతో రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో ముందుకు నడిపిస్తూ.. అన్నీ రంగాల్లోనూ తెలంగాణను అగ్రస్థానంలో నిలిపారు. తెలంగాణలో జరుగుతున్నా అభివృద్ది మరియు సంక్షేమం దేశంలోని ఇతర రాష్ట్రప్రభుత్వాలకు కూడా ఆదర్శంగా నిలుస్తోంది. ముఖ్యంగా ఉద్యోగుల విషయంలో కే‌సి‌ఆర్ చూపిస్తున్న ఉదారతపై అన్నీ దేశంలో నలుమూలల నుంచి ప్రశంశలు కురీపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఉద్యోగులదే కీలక పాత్ర అని చెప్పక తప్పదు. అందుకే ఉద్యోగులపై సి‌ఎం కే‌సి‌ఆర్ తన ఉదాశీలత చతుకుంటూనే ఉన్నారు.

ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయడంలో కూడా ఉద్యోగులదే మేజర్ కంట్రీబూషన్. అందుకే వారి శ్రమను గుర్తిస్తూ రాష్ట్ర సంక్షేమంలో అధిక ప్రదాన్యత ఉద్యోగులకే ఇస్తోంది కే‌సి‌ఆర్ సర్కార్. ఇప్పటివరకు దేశంలోనే అత్యధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఒక విధంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకే మేరుగైన వేతనాలు అందుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇక ఉద్యోగులకు తీపి కబురు వినిపిస్తూ కాంట్రాక్డు వ్యవస్థకు చరమగీతం పాడడంతో పాటు.. త్వరలో కొత్త ఈహెచ్ఎస్ విధానాన్ని ప్రవేశపెట్టబోతుంది కే‌సి‌ఆర్ సర్కార్. కాంట్రాక్ట్ ఉద్యోగులను ఈ ఏడాది ఏప్రెల్ నుంచి క్రమబద్దీకరిస్తూన్నట్లు మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగంలో చెప్పుకొచ్చారు.

దాంతో ఇప్పటివరకు కాంట్రాక్ట్ ప్రతిపాధికన ఉద్యోగులుగా ఉన్నవాళ్ళు ఏప్రెల్ 1 నుంచి శాశ్వత ఉద్యోగులుగా పరిగణించబడతారు. ఇది నిజంగా హర్షించాల్సిన విషయమే. కే‌సి‌ఆర్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 11 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు మేలు జరగనుంది. ఇక ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించడం. గతంలో 60 నుంచి 80 శాతం మాత్రమే స్థానికులకు రిజర్వేషన్లు అమలు అయ్యేవి. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో అటెండర్ స్థాయి నుంచి అన్నీ రకాల ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయి. ఈ విధంగా ఉద్యోగుల విషయంలో కే‌సి‌ఆర్ ప్రభుత్వం తెలంగాణ ను దేశంలోనే నెంబర్ ఒన్ గా నిలుపుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇవి కూడా చదవండి…

రేవంత్ పాదయాత్ర.. కాంగ్రెస్ ను గట్టెక్కిస్తుందా?

నిరంతర ప్రయత్నంతోనే సక్సెస్

పట్నంకు వచ్చిన డబుల్ డెక్కర్‌ బస్సులు..

- Advertisement -