టీటీడీ దర్శన టికెట్ల అప్‌డేట్

7
- Advertisement -

టీటీడీ సేవా కోటా మే నెల కు పూర్తి అయింది. జూన్ -2024 నెల సంబంధించి కోటా 27/05/24 ఉదయం 10గం. లకు బుకింగ్ కు అందుబాటు లోకి వస్తుంది.దర్శన్ (రూ.800/-) కోటా may-2024 వరకు పూర్తి అయినది.. జూన్ -24నెల కు సంబంధించిన కోటా 27/05/24 ఉదయం 10గంటల నుంచి అందుబాటు లోకి వస్తుంది…

ట్రస్ట్, డోనార్స్ సంబంధించిన దర్శనం, వసతి, సేవలు కోటా జూలై-24 వరకు పూర్తి అయినది..ఆగస్టు-24 కోటా 27/05/24 ఉదయం 11:30 లకు అందుబాటు లోకి వస్తుంది… జనరల్ శ్రీవారి సేవ & పరకామణి సేవా కోటా జూలై -2024 వరకు పూర్తి అయినవి .

ఆగస్టు -24 సంబంధించి జనరల్ శ్రీవారి సేవ 27/05/24 ఉదయం 11: 00లకు ,నవనీత సేవ 27/05/24 మధ్యాహ్నం 12:00లకు తిరుమల పరకామణి 27/05/24 మధ్యాహ్నం 1:00 లకు బుకింగ్ కొరకు అందుబాటు లోకి వస్తుంది…

తిరుపతి లోని శ్రీనివాసం, విష్ణునివాసం, గోవిందరాజ సత్రం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద ప్రతి రోజు సమయ నిర్దేశ టోకెన్స్ ( SSD) టోకెన్లు ఉదయం3:00 నుంచి జారీ చేస్తారు… పై మూడు ప్రదేశాలలో సోమవారం నుంచి గురువారం వరకు 25000టోకెన్లు,శుక్రవారం నుంచి ఆదివారం వరకు 30000 టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది…అదే విధంగా శ్రీవారి మెట్టు మార్గం ద్వారా తిరుమల కొండ కు నడిచి వచ్చే వారికి 1200వ మెట్టు వద్ద టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది…

Also Read:పచ్చి ఉల్లి తింటే ప్రమాదమా?

- Advertisement -