Harish:రైతులను అవమానించడం తగదు

6
- Advertisement -

రైతులను అవమానించడం తగదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. భూపాలపల్లి జిల్లా కమలాపూర్ లో ఐకెపి కేంద్రాన్ని సందర్శించారు. ఎన్నికల ముందు 500 రూపాయల బోనస్ ఇచ్చి వడ్లు కొనుగోలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నేడు మాట మార్చిందన్నారు. బాండ్ పేపర్ మీద రాసిచ్చి బోగస్ చేశారు. వంద రోజుల్లో చేస్తానన్న హామీలు ద్దిక్కు లేకుండా పోయాయని… ఎన్నికల ముందు సన్నాలకు మాత్రమే ఇస్తాం అని ఉంటె, ప్రజలు తగిన బుద్ధి చెప్పేవారన్నారు.

వడ్లల్లో రాళ్ళు ఏరినట్లు మిమ్మల్ని ఏరి పారేసేవారు… మంత్రులు అహంకారపూరితంగా మాట్లాడుతున్నారన్నారు. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతా అని ఒకరు అంటే, బోనస్ గురించి అడిగితే రైతులను కుక్కలతో పోల్చుతున్నారన్నారు.రైతులను అవమానపరచడం సరికాదని.. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం అసెంబ్లీని స్తంభింప చేస్తాం అన్నారు.

రైతుల కోసం ఎంత దూరమైన కొట్లాడుతాం. అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇచ్చేదాకా పోరాటం చేస్తాం అన్నారు. కెసిఆర్ ఇచ్చినట్లుగానే ఈ జూన్ నెలలోనే ఎకరాకు 7500 రైతు భరోసా ఇవ్వాలని.. రైతులకు పచ్చిరొట్ట విత్తనం అందించలేని పరిస్థితి నెలకొందన్నారు.హైదరాబాదులో కూర్చోవడం కాదు రైతుల కళ్ళలో కన్నీళ్లు చూడండన్న హరీష్.. మల్లికాంబనే రైతు కళ్ళల్లో నీళ్లు చూస్తే హృదయం ద్రవీభవించిందన్నారు. హార్ట్ పేషెంట్ అయ్యుండి 15 రోజుల నుండి ఎండలో ఉంటూ వడ్లను ఆరబెట్టింది. రాత్రి వర్షం పడడంతో పంట మొత్తం తడిసింది నా పరిస్థితి ఏమిటని దిక్కుతోచని స్థితిలో రోదిస్తుందన్నారు.

Also Read:నేటి ముఖ్యమైన వార్తలు..

- Advertisement -