KTR:రేవంత్ మోసాలను చూస్తే బాధేస్తోంది

9
- Advertisement -

కొత్త రాష్ట్రమైనప్పటికీ…పెట్టుబడులు తరలిపోతాయని అనుమానాలు ఉన్నప్పటికీ ఎన్నో సంస్థలను తీసుకొచ్చాం అన్నారు కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్..టీఎస్ఐపాస్ ద్వారా 24 వేల పరిశ్రమలకు అనుమతులు ఇచ్చాం. 4 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం అన్నారు. పరిశ్రమలు రావటం కారణంగా ప్రైవేట్ సెక్టార్ లో 24 లక్షల ఉద్యోగాలు యువతకు వచ్చాయి…గవర్నమెంట్ సెక్టార్ లో 2 లక్షల 36 వేల ఉద్యోగాలు. ప్రైవేట్ సెక్టార్ 24 లక్షల ఉద్యోగాలు. పదేళ్లలో మొత్తం 26 లక్షల 30 వేల పై చిలుకు ఉద్యోగాలు ఇచ్చాం అన్నారు.

ఇంతకంటే ఎక్కువ రిక్రూట్ మెంట్ చేసిన గవర్నమెంట్ పదేళ్లలో ఏదైనా ఉందా?,మా కన్నా ఎక్కువ ఉద్యోగాలు ఏ రాష్ట్రంలోనైనా ఇచ్చినట్లు చూపిస్తే తెల్లారే సరికి నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని సవాల్ విసిరారు.దీని మీద ఆరు నెలలుగా సవాల్ చేస్తున్న సరే కాంగ్రెస్, బీజేపీ వాళ్ల నుంచి సమాధానం లేదు. కేవలం సొల్లు పురాణం చెబుతున్నారు. తెలంగాణ యువత నెత్తినిండా అబద్దాలను సోషల్ మీడియా ద్వారా నింపి పెట్టారన్నారు.

రేవంత్ రెడ్డి వచ్చాక చేస్తున్న మోసాలను చూస్తుంటే బాధనిపిస్తోందని..ఆరు నెలల్లో ఒక్క నోటిఫికేషన్ అయినా వచ్చిందా?,మేము ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి…దానికి 60 పోస్టులు కలిసి నోటిఫికేషన్ ఇచ్చాడన్నారు.డీఎస్సీ ద్వారా మేము 28 వేల ఉద్యోగాలు వేస్తే రేవంత్ రెడ్డి అప్పుడు లొల్లి పెట్టిండు..మేము డీఎస్సీ ద్వారా 5 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే..దాన్ని రద్దు చేశాడు. దానికి మరో 5 వేల ఉద్యోగాలు కలిపి కొత్త నోటిఫికేషన్ అంటూ ఇచ్చాడన్నారు.రేవంత్ రెడ్డి వచ్చాక ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇయ్యలేదు. జాబ్ క్యాలెండర్ అన్నారు. దాని అతీగతి లేదన్నారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు నిండు అసెంబ్లీలో మేము నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పలేదంటూ మాట మార్చారు…స్వయంగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ నోటి నుంచి నిరుద్యోగ భృతి అనే మాట చెప్పించారు. కానీ ఆ తర్వాత మాట మార్చారన్నారు.ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఫ్రీ అన్నారు. అప్పుడు టెట్ ఫీజు రూ. 4 వందలు ఉంటేనే లొల్లి చేశారు. ఇప్పుడు రూ. 2 వేలు చేశారు…కష్టపడి ప్రైవేట్ సెక్టార్ లో పరిశ్రమలు తెస్తే వాటికి కూడా ఈ సీఎం పాతర వేస్తుంటే బాధనిపిస్తోందన్నారు.ఫార్మా సిటీ ఏర్పాటు చేసి 5 లక్షల ఉద్యోగాలు వచ్చేలా చేస్తే దాన్ని రద్దు చేశాడు. దాన్ని రియల్ ఎస్టేట్ చేస్తాడంట,పరిశ్రమలు రాకుండా ఎక్కడి నుంచి రియల్ ఎస్టేట్ బూమ్ ఉంటుందన్నారు.

Also Read:KTR:స్థానికులకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే

- Advertisement -