రేవంత్ పాదయాత్ర.. కాంగ్రెస్ ను గట్టెక్కిస్తుందా?

26
- Advertisement -

తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు ఉండడంతో ఇప్పటి నుంచే అన్నీ పార్టీల నేతలు ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. ప్రస్తుతం అటు ఏపీ లోనూ, ఇటు తెలంగాణలోనూ పాదయాత్రల జోరు ముమ్మరంగా కొనసాగుతోంది. పార్టీలో జోష్ నింపాలన్నా, ప్రజలకు దగ్గర కావాలన్న పాదయాత్ర ఒక్కటే మార్గమని పోలిటికల్ లీడర్స్ కూడా పాదయాత్ర వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ఇప్పటికే పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరుపున అధినేత్రి వైఎస్ శర్మిల కూడా పాదయాత్ర చేస్తున్నారు. .

ఇప్పుడు కాంగ్రెస్ వంతు వచ్చింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాజాగా ” హత్ సే హత్ జోడో ” పేరుతో పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ పాదయాత్రతో కాంగ్రెస్ కు మళ్ళీ పూర్వవైభవం వస్తుందని హస్తం నేతలు గట్టిగా నమ్ముతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో మనందరికి తెలిసిందే. ఆధిపత్య విభేదాలు, అంతర్గత కుమ్ములాటలు, ఎవరికి వారే అన్నట్లుగా ఉంటున్న నేతలు.. ఇలా కాంగ్రెస్ ను ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో రోజురోజుకు హస్తం పార్టీ బలహీన పడుతూ వచ్చింది. గత ఎన్నికల ముందు టి‌ఆర్‌ఎస్ తరువాతి స్థానంలో ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం ఉనికిని కోల్పోతూ మూడవ స్థానానికి చేరుకుంది.

దీంతో కాంగ్రెస్ ను రాష్ట్రంలో తిరిగి బలపరచాల్సిన అవసరత ఉంది. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ సీనియర్ నేతల మద్య విభేదాలు కాంగ్రెస్ ను మరింత దిగజారుస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. దాంతో టి కాంగ్రెస్ పై అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆధిపత్య విభేదాలను పక్కన పెట్టేసి పార్టీని బలపరిచేందుకు కృషి చేయాలని నేతలకు అధిష్టానం కాస్త గట్టిగానే సూచించిందట. దాంతో రేవంత్ రెడ్డి పాదయాత్రను కాంగ్రెస్ సీనియర్ నేతలంతా స్వాగతిస్తున్నారు. ఈ పాదయాత్రతో కాంగ్రెస్ కు పునర్జీవం పోసి.. పార్టీలో నెలకొన్న అనిశ్చితికి పులిస్టాప్ పెట్టాలని రేవంత్ రెడ్డి దృఢ నిశ్చయంతో ఉన్నారట. మరి ” హత్ సే హత్ జోడో ‘ పాదయాత్ర కాంగ్రెస్ కు ఎంతవరకు ప్లేస్ అవుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి…

బీజేపీ బాబు మోహన్ బూతు పురాణం..

నిరంతర ప్రయత్నంతోనే సక్సెస్

కాలుష్య నివారణే మా లక్ష్యం:కేటీఆర్

- Advertisement -