TTD:జూన్ నెలలో విశేష ఉత్సవాలు

7
- Advertisement -

తిరుమలలో భక్తుల రద్దీ శనివారం ఔటర్ రింగ్ రోడ్డు, శిలా తోరణం వరకు క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. వేస‌వి సెలవులతో పాటు వారాంతపు రద్దీతో దేశం నలుమూలల నుండి తిరుమలకు వచ్చిన భక్తులతో పోటెత్తింది. గ‌త 10 రోజుల్లో శ్రీ‌వారి మెట్టు, అలిపిరి న‌డ‌క మార్గాల్లో దాదాపు 2.60 ల‌క్ష‌ల మంది భ‌క్తులు తిరుమ‌లకు చేరుకొని శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు.

తిరుమలలో జూన్ నెలలో విశేష ఉత్సవాలను గమనిస్తే..జూన్ 1 నుండి 5వ తేదీ వరకు తిరుమలలో ఆకాశగంగా – అంజనాద్రి – బాల ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమజ్జయంతి ఉత్సవాలు.

– జూన్ 2న మహి జయంతి.

– జూన్ 19 నుండి 21వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం.

– జూన్ 20న శ్రీ నాథమునుల వర్ష తిరు నక్షత్రం.

– జూన్ 22న పౌర్ణమి గరుడసేవ జరగనుంది.

- Advertisement -