ర‌జ‌నీకాంత్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్..

202
Keerthy suresh Rajinikanth

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన పేట చిత్రం ఘ‌న విజ‌యాన్ని సాధించింది. తెలుగు, త‌మిళ్ లో మంచి క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతోంది. వ‌రుస హిట్ల‌తో అభిమానుల‌ను ఉత్సాహ‌ప‌రుస్తున్నారు త‌లైవా. ర‌జ‌నీ త‌న త‌ర్వాతి సినిమా ఎవ‌రితో చేయ‌నున్నాడ‌ని ఎద‌రుచూస్తున్నారు అభిమానులు. తాజాగా ఉన్న స‌మాచారం ప్ర‌కారం ఎ.ఆర్ మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న‌డ‌ని తెలుస్తుంది. ఇటివ‌లే ర‌జ‌నీకాంత్ కు క‌థ వినిపించాన‌ని ఆయ‌న నుంచి ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాన‌ని చెప్పారు.

 

వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో దాదాపు సినిమా ఓకే అయిపోయిన‌ట్టే అని చెబుతున్నారు ర‌జ‌నీకాంత్ స‌న్నిహితులు. ఇది పూర్తిగా ఫాంటసీ చిత్రమని తెలిపాడు మురుగ‌దాస్. తాజాగా ఉన్న స‌మాచారం ప్ర‌కారం ఈమూవీలో హీరోయిన్ ను కూడా ఎంపిక చేశార‌ని తెలుస్తుంది. ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న కీర్తి సురేష్ ను తీసుకుంటే బాగుంటుంద‌ని అనుకుంటున్నార‌ట చిత్ర‌యూనిట్. మురుగ‌దాస్ తెర‌కెక్కించిన స‌ర్కార్ సినిమాలో కీర్తి హీరోయిన్ గా న‌టించిన విష‌యం తెలిసిందే.