ఎమ్మెల్యే ఇంటిపై జరిగిన దాడిని ఖండించిన ఎన్నారై టీఆర్ఎస్..

65
nri trs

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ‌తీవ్రంగా ఖండించారు. ఇలాంటి భౌతిక దాడులు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటివని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంపై నోరుమెదపలేని బిజెపి నాయకులకు మతవిద్వేషాలు రెచ్చగొట్టే విషయాల్లో అనవసరమైన అత్యుసాహాన్ని ప్రదర్శిస్తున్నారని అనిల్ కూర్మాచలం ‌తెలిపారు.

తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు సైతం లెక్క చెయ్యకుండా పోరాటం చేసిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీదని, ఇలా ప్రజలని ప్రజా ప్రతినిధులని భౌతిక దాడులతో బయపెడతామంటే చూస్తూ ఊరుకోబోరని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతీ తెలంగాణ బిడ్డ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని బాధ్యతగల రాజకీయ పార్టీ నాయకులుగా ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్య బద్దంగా పోరాటం చేస్తే మంచిదని లేకుంటే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హితవు పలికారు.