మహిళా బిల్లుకై ఎమ్మెల్సీ కవిత పోరాటానికి ఎన్నారైల మద్దతు

40
- Advertisement -

భారత్‌ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళా రిజర్వేషన్ బిల్లుపై చేస్తున్న ఆందోళనకు ఎన్‌ఆర్‌ఐలు మద్దతు పలికారు. వివిధ దేశాలకు చెందిన ఎన్నారైలు హైదరాబాద్ లో సమావేశమై, చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం కోసం ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పోరాటానికి అండగా ఉంటామని తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ (అటై) & ఎన్నారై బీఆర్ఎస్ మహిళా ప్రతినిధులలు జాహ్నవి దూసరి, సుప్రజ పులుసు, స్నేహ, శైలజ & అనిల్ బైరెడ్డి తెలిపారు.

ఓటు వేయడంలో మహిళలకు సమాన హక్కు కల్పించినప్పుడు, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచడానికి అధికారంలో ఉన్న ప్రభుత్వం మహిళలకు ఎందుకు రిజర్వేషన్‌ కల్పించలేదని వారు ప్రశ్నించారు.

21వ దశాబ్దంలో కూడా మహిళా హక్కులు ఇవ్వకపోవడం సరికాదని అన్నారు. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం కోసం రిజర్వేషన్‌ బిల్లు రావాల్సిందే, ఆకాశంలో సగం, ధరణిలో సగం అవకాశంలో సగమని మహిళలకు సమాన స్థానం ఉండాలని, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం చేస్తున్న ఈ ఉద్యమంలో తాము భాగస్వాములై ఎమ్మెల్సీ కవితకు అండగా ఉంటామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగానైతే రోడ్ల మీదకు వచ్చి పోరాడి సాధించుకున్నామో అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా సాధించుకుంటామని తెలిపారు.

యూకేలో 32 శాతానికి పైగా మహిళా ప్రాతినిధ్యాన్ని కలిగి ఉంటే భారతదేశంలో కేవలం 11 శాతం మంది మహిళలు మాత్రమే చట్ట సభల్లో ప్రాతినిధ్యం ఉందని, బీజేపీ ప్రభుత్వానికి నిజంగానే మహిళలపైన గౌరవం, చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో మహిళా బిల్లు ఆమోదం పొందే విదంగా ప్రధాని నరేంద్రమోదీ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో మహిళా ప్రతినిధులతో పాటు ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూస‌రి,
అరవింద్ రెడ్డి, హరిగౌడ్ నవపేట్, రవి ప్రదీప్ పులుసు, జెల్లా శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -