ఎన్టీఆర్ వచ్చేవరకు అర్జున్ రెడ్డికి ఎదురు లేదు !

207
- Advertisement -

అర్జున్ రెడ్డి కి ఎదురు లేదు.. చిన్న బడ్జెట్‌ సినిమానే.. డైరెక్టర్‌కు మొదటి సినిమానే.. హీరోకు ఇమేజ్‌ పెద్దగా లేదు.. అయినా బంపర్ హిట్ కొట్టింది. పెద్ద సినిమాలను కూడా తట్టుకొని విజయవంతంగా దూసుకుపోతుంది. అసలు అర్జున్ రెడ్డి హిట్‌ అవ్వడానికి కారణాలేంటంటే.. ఈ మధ్య విడుదలైన సినిమాల్లో అర్జున్ రెడ్డికి వచ్చిన అవకాశాలు ఏ సినిమాకు కూడా రాలేదు.. విడుదలకు ముందు మొదలయిన కాంట్రవర్సీ నుండి ఈ మధ్య వచ్చిన సినిమాల వరకు ప్రతీ ఫ్యాక్టర్ అర్జున్ రెడ్డికి ప్లస్సే అయింది. అర్జున్ రెడ్డి విడుదలకు ముందు వచ్చిన ట్రైలర్, ప్రొమోలు, అందులో లిప్ లాక్ సీన్లు, బోల్డ్‌ పబ్లిసిటీ ఇవన్నీ అర్జున్‌ రెడ్డికి ఉపయోగపడ్డాయి. చిన్న బడ్జెట్ సినిమానే అయినప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్‌ కొట్టి బాక్సాఫీస్‌ వద్ద పోటీలేకుండా దూసుకుపోతోంది.

 vip2

అర్జున్‌ రెడ్డితో పాటు తమిళ డబ్బింగ్ సినిమాలు వీఐపీ2, వివేగం విడుదలయ్యాయి. అయితే ఈ సినమాలు అర్జున్‌ రెడ్డికి ఏ మాత్రం పోటీ ఇవ్వకుండానే వెనక్కివెళ్లాయి. ఇక గత వారం బాలకృష్ణ నటించిన పైసా వసూలు కూడా విడుదలైంది. ఈ సినిమాలో బాలయ్య నటనకు మంచి మార్కులే పడ్డప్పటికీ, పూరి జగన్నాథ్ డైరెక్షన్ జనాలను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇది కూడా అర్జున్ రెడ్డికి ప్లస్ అయింది. పెద్ద టిక్కెట్ సినిమా ఆయన పైసా వసూల్‌ డిజాస్టర్ వైపు పరుగెడుతుంది. ముఖ్యంగా పైసా వసూల్ కలెక్షన్లు అర్జున్ రెడ్డి కంటే చాలా తక్కువగా ఉన్నాయంట. అలాగే ఈ వారం రెండు కొత్త సినిమాలు కూడా వచ్చాయి. నాగ చైతన్య నటించిన యుద్ధం శరణం మరియు అల్లరి నరేష్ నటించిన మేడ మీద అబ్బాయి సినిమాలు కూడా పెద్దగా పబ్లిక్ టాక్ తెచ్చుకోలేదు. ఈ సినిమాలు కూడా అర్జున్ రెడ్డికి బ్రేకులు వేయలేకపోయాయి.

naresh naga chaitanya

ఇకపోతే సెప్టెంబర్ 15న సునీల్ నటించిన ఉంగరాల రాంబాబు, బాహుబలి రైటర్ విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో వస్తున్న శ్రీవల్లి, మరో మూవీ ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినంతో పాటు మొత్తం ఏడు సినిమాలు వస్తున్నాయి. వీటిలో ఏ సినిమాకు కూడా అంత హైపు లేదు. దీన్ని బట్టి చూస్తే వచ్చే వారం కూడా అర్జున్‌ రెడ్డికి  పోటీగా వచ్చే సినిమా లేకపోవడంతో, మరో పది రోజులు అర్జున్‌ రెడ్డి హవా కొనసాగేలా ఉంది.

7 movies

అయితే సెప్టెంబర్ 21 ఎన్టీఆర్ నటించిన జై లవకుశ విడుదలకు సిద్ధమవుతోంది. అప్పుడే అర్జున్ రెడ్డి బ్రేగులు పడాలంటే ఎన్టీఆర్ రావాల్సిందే. కాగా, కలెక్షన్ల పరంగా చేస్తే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 22 కోట్లు(గ్రాస్ రూ. 40 కోట్లు) షేర్‌ వసూలు చేసింది. జై లవకుశ విడుదలకు మరో పది రోజల సమయం ఉండడంతో రూ. 30 కోట్ల మార్కు అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -