రాష్ట్రంలో కొత్తగా కరోనా కేసు నమోదు కాలేదు..

488
etela
- Advertisement -

తెలంగాణలో కరోనా వైరస్‌ పై వస్తున్న వదంతులు నమ్మెద్దని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. ఈరోజు కరోనా రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఇప్పుడు ఒక్క కరోనా రోగి కూడా లేరు. కొత్తగా కరోనా ఎవరికి రాలేదు అన్నారు.

దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి 2 సార్లు చేసిన పరీక్షల్లో కరోనా నెగెటివ్ వచ్చింది. కాబట్టి అతనిని త్వరలో డిశ్చార్జ్ చేస్తాము. కరోనా సోకితే చనిపోతారని చేసిన ప్రచారం తప్పు అని ఈ ఘటనతో రుజువైంది. గతంలో వైరల్ జ్వరాలు వచ్చిన వారికి ఇచ్చిన వైద్యమే కరోనా రోగులకు ఇస్తున్నాము. కరోనాకి త్వరలో వాక్సిన్ ,మందులు వస్తాయాన్ని ఆశిస్తున్నము అని మంత్రి తెలిపారు.

మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లిన వెళ్లి వస్తున్న వారి ద్వారా ఇక్కడికి కరోనా రాకుండా ఎయిర్ పోర్ట్ లొనే పరీక్షించి సరైనా చికిత్స ఇస్తాము. గతంలో గాంధీలో మాత్రమే వైరాలజీ ల్యాబ్ ఉంది. ఇప్పుడు ఉస్మానియాతో పాటు ,ఐ పీఎం, ఫీవర్ హాస్పిటల్, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కూడా వైరాలజీ లాబ్ లకు కేంద్రం అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి 5 లాబ్ లలో పూర్తి స్థాయిలో పరీక్షలు చేస్తామన్నారు.

అలాగే సుల్తాన్ బజార్, చెస్ట్ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్ తో పాటు ఉమ్మడి జిల్లాల్లోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా కరోనా ఐసోలేటెడ్ రూమ్స్ ఏర్పాటు చేశాము. కరోనా రోగుల కోసం ఎఫ్ ఆర్ ఫిల్టర్స్ ని ఏర్పాటు చేస్తాము. దీని ఫలితంగా రోగులు వదిలిన గాలి శుద్ధి అవుతుందని ఈటెల పేర్కొన్నారు.

ఐ ఏ ఎస్ అధికారిని శ్రీదేవిని పర్చేజింగ్‌ కమిటీ కి ఛైర్మెన్ గా నియమించాము. మందులు ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తారు. మాణిక్ రాజ్ ఐఏఎస్ పేషెంట్స్ ని హౌస్ ఐసోలాషన్ ఉన్న వారిని ట్రాక్ చేస్తారు. ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ కి సంబంధించిన పని ఐ ఆండ్‌ పీఆర్ డిపార్ట్మెంట్ కి చెందిన ఐ ఏ ఎస్ అధికారి చూస్తారని వివరించారు.

- Advertisement -