నిజామాబాద్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రారంభం..

129
kavitha

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైంది. నిజామాబాద్‌లోని పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ జరుగుతుండగా కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్త చర్యలు ఏర్పాటుచేసిన అధికారులు కౌంటింగ్ కేంద్రానికి ఒక్కో పార్టీ నుండి ఎనిమిది మందిని అనుమతించారు.

మొత్తం రెండు రౌండ్లలో లెక్కింపు జరగనుండగా మొదటి రౌండ్‌లో 600 ఓట్లు, రెండోరౌండ్‌లో మిగిలిన 221 ఓట్లను లెక్కించ‌నున్నారు. ఉద‌యం 10.30 గంట‌ల వ‌ర‌కు ఫలితం వెలువ‌డ‌నుంది.

మొత్తం 824 మంది ఓటర్లు ఉండ‌గా 823 మంది ప్ర‌జాప్ర‌తినిథులు త‌మ ఓటుహ‌క్కు వినియోగించుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ క‌విత‌, కాంగ్రెస్ నుంచి వ‌డ్డేప‌ల్లి సుభాష్‌రెడ్డి, బీజేపీ అభ్య‌ర్థిగా పోత‌న్‌క‌ర్ ల‌క్ష్మీనారాయణ పోటీచేశారు. కవిత ఎన్నిక లాంఛనమే కానుంది.