భారీ ఆధిక్యంలో కల్వకుంట్ల కవిత…

113
kavitha

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక‌లో టీఆర్ఎస్ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. తొలి రౌండ్ ముగిసే సరికి ఆ పార్టీ అభ్యర్ధి కల్వకుంట్ల కవితకు 600 ఓట్లకుగాను 542 పోలయ్యాయి.

మిగిలిన 221 ఓట్ల‌ను రెండోరౌండ్‌లో లెక్కించ‌నున్నారు. మ‌రికొద్దిసేప‌ట్లో పూర్తి ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. విజ‌యానికి అవ‌స‌ర‌మైన ఓట్ల‌ను క‌విత ఇప్ప‌టికే సాధించారు.

నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ స్థానానికి అక్టోబర్ 9న పోలింగ్ జరిగింది. మొత్తం 824 మంది ఓటర్లు ఉండ‌గా, 823 మంది ప్ర‌జాప్ర‌తినిథులు త‌మ ఓటుహ‌క్కు వినియోగించుకున్నారు.