కొత్త షెడ్యూల్‌లో నితిన్ మూవీ..

106
Nithin

యూత్‌ స్టార్‌ నితిన్‌ వరుస సినిమాతో దుసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈ హీరో నటిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. ఇక ఈ మూవీ చిత్రీకరణ ముగింపు దశలో ఉండగానే, మరో సినిమా ‘చెక్’ సెట్స్ పైకి వెళ్లింది. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వస్తున్న ‘చెక్’లో నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా వారియర్ నటిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి.ఆనందప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

అయితే తాజాగా ‘చెక్’ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభించారు చిత్ర బృందం. కరోనా ప్రభావంతో ఇన్నాళ్లు షూటింగ్ నిలిచిపోయింది. లాక్ డౌన్‌కు ముందే ముహూర్తం షాట్ జరిగినా, కరోనా ప్రభావం ఈ సినిమాపైనా పడింది. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ లుక్ రిలీజవగా, అభిమానుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇటీవల భీమ్మ మూవీతో సూపర్‌ హిట్‌ అందుకున్నాడు ఈ యంగ్‌ హీరో.