నితిన్ ‘చెక్‌’ ఫస్ట్‌ గింప్స్‌.. వీడియో

37
Check

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్ చంద్రశేఖర్‌ యేలేటి డైరెక్షన్‌లో ‘చెక్‌’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నితిన్‌కు జంటగా రకుల్ ప్రీత్ సింగ్, మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ నటిస్తున్నారు. తాజాగా ‘చెక్‌’ మూవీ ఫస్ట్‌ గింప్స్‌ని ఆదివారం విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో నితిన్‌ ఆదిత్య అనే ఖైది పాత్రలో నటిస్తున్నాడు.

‘జైలులో ఆదిత్య అనే ఖైది చెస్‌ అద్భుతంగా ఆడుతున్నాడు’ అని ఒక వ్యక్తి చెబుతుంతే.. ‘అద్భుతంగా అంటే? అని మరో వ్యక్తి ప్రశ్నించగా, విశ్వనాథ్‌ ఆనంద్‌, కస్పరోవ్‌ లాగా అని మరో వ్యక్తి సమాధానం ఇచ్చాడు. ఇక పోలీస్‌ ఆఫీసర్‌ అయిన సంపత్‌ రాజ్‌.. తీవ్రవాది, టెర్రరిస్ట్‌, దేశద్రోహి ఇది నీ గుర్తింపు అంటూ నితిన్‌ని హేళన చేస్తున్నాడు. ఈ ఫస్ట్‌ గ్లింప్స్‌ చూస్తుంటే సినిమాపై భారీ అంచనాలను పెంచుతుంది. మ‌రి కొద్ది రోజుల‌లో ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి కానుంది.

Check Telugu Movie First Glimpse | Nithiin | Rakul Preet | Priya Varrier | Chandra Sekhar Yeleti