వ్యవసాయాన్ని శాసించేది ఆహారరంగమే..

39
- Advertisement -

భావి ప్రపంచాన్ని శాసించేది ఆహారరంగమే అన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. రవీంద్రభారతిలో నిర్వహించిన తెలుగు రైతుబడి యూట్యూబ్ ఛానల్ 1 మిలియన్ స్టోన్ మెగా ఈవెంట్ లో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు నిరంజన్ రెడ్డి. సృష్టిలో మారనిది ఒకే ఒక్కటి వ్యవసాయం అన్నారు. కాలక్రమంలో అనేక వృత్తులు మారుతుంటాయి…శాస్త్ర, సాంకేతికత ఎంత పెరిగినా ఆహారం వ్యవసాయం ద్వారానే వస్తుంది .. దీనికి ప్రత్యామ్నాయం లేదు అన్నారు. రైతును మించిన అనుభవం గల శాస్త్రవేత్త ఈ భూగోళంలో లేడన్నారు.

సృష్టిలో జీవులన్నింటికీ ఆహారం అవసరం అని…అన్ని జీవులు భుజించిన పంట ఆఖరుకు రైతు ఇంటికి వస్తుందన్నారు. 800 కోట్ల పైచిలుకు ప్రపంచ జనాభాకు అవసరమైన ఆహారం అమెరికా, చైనా, భారత్ ల నుండే ఎక్కువ భాగం వస్తుందన్నారు. అమెరికా, చైనాల కన్నా సాగుకు యోగ్యమైన భూమి భారత్ లో అత్యధికంగా ఉందని…భవిష్యత్ ప్రపంచ ఆహార అవసరాలు తీర్చే శక్తి భారతదేశానికి మాత్రమే ఉందన్నారు.వ్యవసాయం ఆధునిక పరిశ్రమగా ఎదిగేందుకు వ్యవసాయ అనుకూల విధానాలు కావాలన్నారు.

Also Read:ఇవి మీ డైట్ లో ఉంటేచాలు..!

డాలర్లు, రూపాయలు ఆహారం అందించలేవని…మానవుడు స్థిరమైన వ్యవసాయం కనుక్కుని ఆచరించడం పదివేల సంవత్సరాలు అయిందన్నారు. గత 120 ఏళ్ల కాలంలో వ్యవసాయరంగంలో అనేక మార్పులు సంభవించాయన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో దేశంలో తిండిగింజలకే కొరత ఉండేది…అప్పట్లో వ్యవసాయం తర్వాత అతిపెద్ద పరిశ్రమ చేనేత అన్నారు. 1963 తర్వాత వచ్చిన సస్యవిప్లవం మూలంగా వచ్చిన ఎరువులు, నూతన వంగడాలతో పంటలలో దిగుబడి పెరిగిందన్నారు. భారతదేశ వ్యవసాయ పితామహుడు అంటే బాబూ జగ్జీవన్ రామ్ అనే చెప్పాలన్నారు.

రైతుబంధు పథకం కింద పది ఎకరాల పైన ఉన్న రైతులు లబ్దిపొందుతున్నది కేవలం 1.22 శాతం మాత్రమే అన్నారు. రైతుబంధు పథకం గురించి కొందరు వ్యక్తులు, ఒక వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశాన్ని దోచుకుని విదేశాలకు పోయిన దొంగల గురించి వారు చర్చించరు .. వార్తలు రాయరు కానీ రైతుకు చేసిన సాయం మీద వక్రభాష్యాలు చెబుతున్నారు .. ఈ ధోరణి మారాలన్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగాలి…రైతాంగానికి తక్కువ ధరలో యంత్రాలు అందేలా కృషిచేయాలని శాస్త్రవేత్తలను కోరడం జరిగిందన్నారు.

Also Read:బద్ధకం పోవాలంటే ఈ సూచనలు..

- Advertisement -