Niranjan:ఎకరాకు 10వేల నష్టపరిహారం ఇవ్వాలి

11
- Advertisement -

ప్రకృతి విపత్తు వల్ల నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన నిరంజన్ రెడ్డి…మీ చ‌ర్య‌ల వ‌ల్ల‌, క‌రెంట్.. నీళ్లు ఇవ్వ‌క‌ ఎండిపోయిన పంటలు ఎన్ని ఉన్నాయో లెక్క‌లు తీయాలన్నారు.

ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా రెండున్న‌ర కోట్ల మంది సేద్యాన్ని న‌మ్ముకొని బ‌తుకుతున్నారు. వారంద‌రినీ ఆదుకోవాల్సిన బాధ్య‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ఉంద‌న్నారు.ప్ర‌పంచంలోని సంప‌న్న దేశం అమెరికా నుంచి పేద దేశాల వ‌ర‌కు అప్పులు అనేది ఆయా దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో భాగం. అప్పులు చేసి సంప‌ద‌ను సృష్టిస్తారు.

వారు అలా ఎకాన‌మీని పెంచుకుంటారు. అప్పులు ఏదో కేసీఆర్ త‌న ఇంటి కోసం చేసిన‌ట్టు నీచంగా, చుల‌క‌న‌గా మాట్లాడారు కాంగ్రెస్ నేత‌లు. కేసీఆర్ అప్పులు చేశాడు అని దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 100 రోజుల్లోనే రూ. 16,400 కోట్లు ఎలా అప్పు చేశారు.

Also Read:లోక్ సభ ఎన్నికలు..మార్గదర్శకాలివే

- Advertisement -