Niranjan:తీవ్ర ఇబ్బందుల్లో రైతులు..

14
- Advertisement -

ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసీన దిన దినం రైతుల ఇక్కట్లు,అవస్తలు పెరుగుతున్నాయన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన నిరంజన్ రెడ్డి..అగమై రైతులు ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులు ఆగం అవుతారని అలోచన చేయలేదు అన్నారు.గ్రామాల్లో ఎక్కడకు పోయిన రైతుల ఆందోళనలు కన్పిస్తున్నాయి..భిన్న రూపాల్లో రైతులు వాళ్ళ ఆక్రోశాన్ని చూపిస్తున్నారన్నారు.

ఎండిన పంటలు కాల బెట్టుకుంటున్నారు.చెప్పులతో చెంపలు వేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓటు వేశామని…కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు తప్ప ఇంకోటి లేదు.ఇతర పార్టీ వాళ్ళను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని కండువా కప్పుతున్నారు తప్ప వీళ్ళు చేసింది ఏం లేదన్నారు. 150 రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని…రైతులు ఇన్ని ఇబ్బందులు పడ్డ వాళ్ళ దగ్గరకు ఎందుకు పోతాలేరు ఈ మంత్రులు ఎమ్మెల్యేలు అన్నారు.

కాంగ్రెస్ మంత్రులు ధైర్యం ఇవ్వడం ఎందుకు లేదు.రైతుల దగ్గరకు పోయే దమ్ము లేదా…రైతులకు మీరు ఇస్తామన్న క్వీన్టల్ బోనస్ 500 ఎక్కడ.మీరు ఇస్తామన్న రైతు బంధు ఎక్కడ అన్నారు. తుమ్మల నాగేశ్వరరావు కూడా రైతునే ఎందుకు ఆయన మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు…ఆయన అంటే నాకు కూడా గౌరవం ఉంది కాని ఎవరిని మెప్పించడానికి ఇలా మాట్లాడుతున్నాడో నాకు జాలి వేస్తుందన్నారు. మీరు కూడా 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు అప్పుడు రైతుల గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో..కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కృష్ణా డెల్టాలో నీళ్లు లేవు….కానీ గోదావరి నది లో నీళ్లు ఉన్నాయి వాటిని వాడుకోవాలని మేము మాట్లాడం కానీ పట్టించుకోలేదు .ఆనాడు 5 వేల క్యూసెక్కుల నీరు పోతుండే ఇప్పుడు కూడా 3 వేల క్యూసెక్కుల నిరు పోతుందన్నారు.

ఇవాళ రైతుల్లో ఆక్రోశాన్ని చూసి నంది మేడారం దగ్గర నీటిని లిఫ్ట్ చేస్తున్నారు..కె ఎల్ ఐ దగ్గర కూడా నీళ్లు ఉండే మీరు వాడుకోలేదు.ఒక్క వ్యవసాయ శాఖ మంత్రి నో,నీటిపారుదలశాఖ మంత్ర నో ఒక్క ప్రాజెక్టును ఆయిన సందర్శించారా.కనీసం ఒక్క సమీక్ష అయిన చేశారా అన్నారు. వ్యవసాయ రంగం గురించి మీరు మాట్లాడుతున్నారు.కరువు కు నెలవైనా తెలంగాణ ను సస్యశ్యామలం చేసింది మేము కాదా ఆలోచించాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు బుద్దిచెప్పాలన్నారు.

Also Read:IPL 2024 :ముంబై బోణి కొట్టేనా?

- Advertisement -