అశ్వ‌థ్థామ…నిన్నే నిన్నే పాట విడుద‌ల‌

290
ashwaddhama

యువ క‌థానాయకుడు నాగ‌శౌర్య హీరోగా ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `అశ్వ‌థ్థామ‌`. ర‌మ‌ణ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. జ‌న‌వ‌రి 31న సినిమాను విడుద‌ల చేస్తున్నారు.

ఈ సినిమా హీరో నాగ‌శౌర్య‌నే ఈ సినిమాకు క‌థ‌ను అందించాడు. సినిమా పేరుని త‌న ఛాతిపై ప‌చ్చ‌బొట్టుగా పొడిపించుకున్నాడు నాగ‌శౌర్య‌.

సినిమా విడుద‌ల సంద‌ర్భంగా సినిమా యూనిట్ స‌భ్యులు భారీ ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు సినిమా పోస్ట‌ర్స్‌, మోష‌న్ పోస్ట‌ర్స్, నిన్నే నిన్నే తొలి లిరిక‌ల్ వీడియో సాంగ్ ప్రొమోకు ప్రేక్ష‌కుల నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీత సారథ్యం వ‌హించిన `నిన్నే నిన్నే…` పూర్తి పాట‌ను గురువారం విడుద‌ల చేశారు. నాగ‌శౌర్య‌, మెహ‌రీన్‌పై ఈ సాంగ్‌ను చిత్రీక‌రించారు. విశ్వ ర‌ఘు ఈ పాట‌కు నృత్య రీతుల్ని స‌మ‌కూర్చారు.